Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 June 2025, 1:46 pm Posted by : ramakrishna

మరోసారి రూ.లక్ష దాటిన బంగారం ధర

హైదరాబాద్‌,బతుకమ్మ :  హైదరాబాద్‌లో 24 క్యారెట్ల నాణ్యత కలిగిన 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ.1,00,210,  కిలో వెండి ధర రూ.1,08,700 పలికింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం వంటి కారణాలతో బంగారం ధరకు భారీ డిమాండ్ పెరిగింది. కేంద్ర బ్యాంకులు సైతం బంగారంను కీలకమైన రిజర్వ్ ఆస్తిగా భావిస్తూ కొనుగోళ్లు పెంచుతుండడం కూడా ధర పెరుగుదలకు కారణమని వెల్లడించిన ఇండియా బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అక్షా కాంబోజ్ తెలిపారు.