రూ.లక్ష మార్కును దాటిన పసిడి

అక్షయ తృతీయకు ముందు బిగ్‌ షాక్‌ సామాన్యుడికి అందనంత ఎత్తులో దూసుకెళ్తున్న బంగారం   హైదరాబాద్, బతుకమ్మ: బంగారం ధరలు అదుపు లేకుండా పరుగులు పెడుతున్నాయి. కేవలం పెట్టుబడి సాధనంగానే కాకుండా, భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన పసిడి, ఇప్పుడు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారుతోంది. తాజాగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులం (10 గ్రాములు) ధర ఏకంగా రూ.1,02,062కి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. లక్ష రూపాయల గీతను దాటడం, బంగారం మార్కెట్‌లో పెను సంచలనంగా మారింది. అక్షయ తృతీయ...