మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ
బతుకమ్మ,మెండోరా: ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ మెడలో నుంచి ముగ్గురు దుండగులు బంగారు గొలుసును లాకెళ్ళిన ఘటన ముప్కాల్ బైపాస్ రోడ్ పై జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి ఏలేటి దేవాయి అనే మహిళ కోడిచెర్ల గ్రామానికి ఆటోలో వెళుతుండగా ఆమె మెడలో నుంచి గొలుసులు లాక్కొని వెళ్లినట్లు పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.