Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 7:46 pm Posted by : ramakrishna

మహిళ ప్రయాణికురాలి మెడలోని బంగారు గుండ్లు మాయం

 

. . . బస్సును నిలిపి తనిఖీలు చేపట్టిన పోలీసులు

 

నందిపేట్, బతుకమ్మ :

 

బస్సులో ప్రయాణిస్తున్న మహిళ ప్రయాణికురాలు మెడలో నుంచి బంగారు గుండ్లు మాయం అయ్యాయి. విషయాన్ని గమనించిన మహిళ తన బంగారం గుండ్లు పోయాయని లబోదిబోమంది. వెంటనే బస్సు డ్రైవర్ బస్సును నందిపేట్ పోలీస్ స్టేషన్ తరలించి తనిఖీలు చేపట్టారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం నందిపేట్ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి బంగారు గుండ్లను వెతికే పనిలో పడ్డారు. అందులో ఉన్న ప్రయాణికులందరినీ కిందకు దించి గాలించారు.