సెల్ఫీ కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
బాన్సువాడ, బతుకమ్మ : నిజాంసాగర్ డ్యాం వద్ద సెల్ఫీ కోసం నీళ్లలోకి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలానికి చెందిన గైని పండరి (28) అనే యువకుడు శనివారం నిజాంసాగర్ సందర్శనకు వెళ్లాడు. గార్డెన్ వద్ద అందరు చూస్తుండగా సెల్ఫీ కోసం నీళ్లలోకి దిగాడు. ఎంతసేపటికి కనిపించకుండా పోయాడు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు నిజాంసాగర్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్సై శివకుమార్ తన సిబ్బంది తో ప్రాజెక్ట్ వద్దకు వచ్చి పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది, ఎస్ఎఫ్ వినోద్ సిబ్బంది...