Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 8:16 pm Posted by : ramakrishna

తెలంగాణ ఆత్మను చాటిన గాడ్స్ ఇన్ ది వాయిస్

 

. . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

. . . ఒగ్గు కథ ఇంగ్లిష్ డాక్యుమెంటరీ టీజర్ రిలీజ్

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ ఒగ్గు కథను ప్రపంచానికి చాటేలా, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలా ‘‘గాడ్స్ ఇన్ ది వాయిస్’’ డాక్యుమెంటరీ కల్చర్ ఫిల్మ్ రూపొందించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో డాక్టర్ జి. కుమారస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ‘‘గాడ్స్ ఇన్ ది వాయిస్’’ టీజర్ ను కవిత లాంచ్ చేశారు. తెలంగాణ ఒగ్గు కథను అద్భుతమైన డాక్యుమెంటరీగా తెరకెక్కిస్తున్న కుమారస్వామితో పాటు మూవీ టీమ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, మూవీ యూనిట్ సభ్యులు ప్రొఫెసర్ జోలి పోతుసెర్రి, మేఘా యాదవ్, మహేశ్వర్, జయదేవ్ యాదవ్, సాయి రుద్రకాంత్, తిరుపతి యాదవ్, కవిత యాదవ్, రాజ్ కుమార్, శ్రీణిక, గనికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Gods in the Voice, which expresses the soul of Telangana