బాన్సువాడ సరస్వతి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు

బతుకమ్మ , బాన్సువాడ : విజయదశమి పండుగ పురస్కరించుకొని గ్రామం మొదలుకొని పట్టణాల వరకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మండపాల్లో అమ్మవారిని ప్రతిష్టాపన చేసి తొమ్మిది రోజులపాటు కుంకుమార్చనలు, యజ్ఞాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ పట్టణ కేంద్రంలో గల సరస్వతి ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళలో కుంకుమ అర్చన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, మధ్యాహ్నం యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సరస్వతి ఆలయం బాన్సువాడలో ఉండడంతో పరిసర ప్రాంతాలు నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ఓడి...