Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 12:12 pm Posted by : ramakrishna

డీసీఎం ఢీకొని మేకల కాపరి మృతి

. . . 25 మేకలకు ప్రమాదం

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని కొట్టాల గ్రామ ప్రధాన రహదారిపై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, పెద్ద సంఖ్యలో మేకలు మృతి చెందాయి.కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వైపు వస్తున్న డీసీఎం వాహనం రోడ్డు దాటుతున్న మేకల మందపైకి అదుపుతప్పి దూసుకెళ్లడంతో సుమారు 25 మేకలు ప్రమాదానికి గురయ్యాయి. వీటిలో కొన్ని మేకలు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొన్ని మేకలకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.ఈ ప్రమాదంలో మేకల కాపరి కొట్టాల గ్రామానికి చెందిన ఒడ్డె శివయ్య(70)తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు సమాచారం.డీసీఎం వాహనం అతివేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంతో కొట్టాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేకల పెంపకమే జీవనాధారంగా ఉన్న కుటుంబానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Goat herder dies after being hit by a DCM van.
Goat herder dies after being hit by a DCM van.