Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 April 2025, 4:20 pm Posted by : ramakrishna

ఇంటింటికి వెళ్లి అవగాహణ

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ  సోమవారం గ్రామం లో బడిబాట నిర్వహించడం జరిగినది. ఇంటి, ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల వసతులు, ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు,మధ్యాహ్న భోజనం, స్కాలర్షిప్లు, ఉచిత యూనిఫామ్ లు మొదలగు వాటిని తల్లిదండ్రులకు తెలియజేసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చేర్పించాలని  కోరడమైనది. యుపిఎస్ పాలెం పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఏడో తరగతి పూర్తి చేసిన విద్యార్థులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలెం కు పంపించాలని కోరడమైనది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పల్లెపాటి. వేణుగోపాలరావు, ఉపాధ్యాయులు మహేష్ కుమార్, చంద్రశేఖర్, నరసింహస్వామి, రాజేందర్, జయశ్రీ,త్రివేణి, మమత, రాజేశ్వరి, సైఫ్ అలీ  తదితరులు పాల్గొన్నారు.