Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 February 2025, 5:29 pm Posted by : ramakrishna

జ్ఞాన వాగ్దేవి సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాల జ్ఞాన వాగ్దేవి విద్యాలయంలో సోమవారం జ్ఞాన వాగ్దేవి విద్యాలయ సంస్థ అధ్యక్షులు గంగ రాజయ్య ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్ హాజరయ్యారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు ఆటలలో,పాటలలో కళా నృత్యంలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించినప్పుడే తమ తమ యొక్క ప్రతిభ తెలుస్తుందన్నరు.25వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థిని,విద్యార్థుల కళ నృత్య ప్రతిభ చూపర్లను ఆకట్టుకున్నాయి. సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవానికి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.విద్యార్థులు చేసే నృత్యాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథులుగా డిచ్ పల్లి సిఐ జె నరేష్,సదాశివ నగర్ ఎంపీడీవో సంతోష్ కుమార్, కరస్పాండెంట్ గంగా రాజయ్య, సెక్రటరీ రాధిక, కోశాధికారి గంగాధర్, ప్రిన్సిపాల్ ఓంకార చారి,వైస్ ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్, దేవేందర్ గుప్తా,అనుదీప్ గుప్తా,విద్యార్థుల తల్లిదండ్రులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Gnana Vagdevi Silver Jubilee Anniversary