Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 December 2024, 3:29 pm Posted by : ramakrishna

వైభవంగా అయ్యప్ప స్వామి సామూహిక మహా పడిపూజ

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అయ్యప్ప స్వామి సామూహిక పడి పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, కుమారస్వామి పూజ, అయ్యప్ప స్వామి ప్రతిమలకు అభిషేకాలు నిర్వహించి, మంగళ హరతులతో ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి పాటలు, కీర్తనలతో పూజ మందిరం మారు మ్రోగింది. అనంతరం శబరిమలై వరకు పాదయాత్ర నిర్వహించిన స్వాములకు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ పడిపూజ కార్యక్రమంలో రుద్రూర్ గురుస్వాములు పద్మ ప్రదీప్ స్వామి, శ్యామ్ స్వామి, ప్రసూన్ స్వామి, అనీల్ స్వామి, రాజు స్వామి, పత్తి రాము స్వామి, శ్రావణ్ స్వామి, పత్తి నవీన్ స్వామి, బోధన్, కోటగిరి, వర్ని, మోస్రా మండలాల అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

Glorious Ayyappa Swami Mass Maha Padipuja