Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2024, 8:02 pm Posted by : ramakrishna

ఈవెంట్ మ్యానెజ్మెంట్ లో భాగంగా టీయూ లో గ్లోబల్ ఎంటర్ప్రీనియోర్షిప్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  తెలంగాణ యూనివర్సిటీ,మ్యనేజ్మెంట్ డిపార్ట్మెంట్ విద్యార్థులు గ్లోబల్ ఎంటర్ప్రీనియోర్షిప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిస్ట్రార్ యాదగిరి హాజరై మాట్లాడారు.  విద్యార్ధులు ఎంటర్ప్రీనియోర్షిప్ స్కిల్స్ పంచుకోవాలన అన్నారు. భవిష్యత్తులో మీరు అందరు,నూతన ఆలోచనలతోటి మంచి వ్యవస్థాపకులు గా మారాలని కోరారు.  ప్రిన్సిపల్ ఆచార్య ఆరతి విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో ఉత్సాహం తో పాల్గొనడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. వ్యాపార మెలుకువలు ఇంకా నేర్చుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమానికి తమ తమ రంగంలో విజయం సాధించిన ఔత్సాహిక వ్యవస్థాపకులు ,  శిల్పి ధర్మేంద్ర కిరణ్ , ఆటో మొబైల్ రంగ నిపుణుడు ఆరుగొండ రవి , ఆహార ఉత్పాదనలు నిపుణుడు మోహన్  పాల్గొని  వారి వ్యపార అనుభవాలను పంచుకున్నారు. ప్రోగ్రాం డైరెక్టర్ , విభాగ అధిపతి ఆచార్య ఆంజనేయులు  కార్యక్రమం ప్రాధాన్యతను తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ,బిజినెస్ క్విజ్ లో న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ వాణి , రాజేశ్వరి వ్యవహరించారు. బిజినెస్ ప్లాన్ పోటీలకు ఆచార్య అపర్ణ , కైసర్  వ్యవహరించారు.  కార్యక్రమం లో డాక్టర్ కిరణ్ రాథోడ్ , డాక్టర్ అలోక్,  విద్యార్థులు పాల్గొన్నారు.