మైనర్లకు వాహనాలు ఇస్తే ఇక జైలుకే
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఎవరైనా మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమానులపై కేసు నమోదు చేసి సంబంధిత న్యాయస్థానంలో హాజరు పరిచి చట్టపరమైన చర్యలు తీసుకొని రూ.25 వేల వరకు జరిమానా కూడా విధిస్తామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు గురువారం ఐదుగురు మైనర్లను వాహనం నడుపుతుండగా పట్టుకున్నారని అన్నారు. వారిని అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓ పి.ప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి...