Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 April 2025, 7:35 pm Posted by : ramakrishna

మైనర్లకు వాహనాలు ఇస్తే ఇక జైలుకే

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇక నుంచి మైనర్లకు వాహనాలు ఇస్తే జైలు శిక్ష తప్పదని ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు.  నగరంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ద్విచక్ర వాహనం నడుపుతూ పట్టుపడిన మైనర్లకు, వారి తల్లిదండ్రులకు సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించి జరిమాన విధించారు. నగరంలో ఐదుగురు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని తెలిపారు. ఇక నుండి ఎవరైనా మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానులపై కేసు నమోదు చేసి సంబంధిత న్యాయస్థానంలో హాజరు పరిచి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూ.25వేల వరకు జరిమానా కూడా విధిస్తామని తెలిపారు. న్యాయస్థానాలు వాహన యజమానులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు.