విద్యార్థులకు బహుమతులు అందజేత
బాన్సువాడ, బతుకమ్మ : బాలల దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ నిర్వహించిన ట్రాఫిక్ అవగాహన సదస్సుకు బాన్సువాడ నుంచి వివిధ పాఠశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు హాజరయ్యారు. సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత, సామాజిక బాధ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలలో విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. బాన్సువాడకు చేరుకున్న విద్యార్థులను సీఐ శ్రీధర్ బహుమతులు అందజేశారు.