Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 8:54 pm Posted by : ramakrishna

13వ వార్డు అభివృద్ధికి మరోసారి అవకాశం ఇవ్వండి

. . . మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్గా బాడీ శ్రీనివాస్ గత పది సంవత్సరాలుగా పదవీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించానని ఆయన పేర్కొన్నారు. 13వ వార్డు టీచర్స్ కాలనీలో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులతో కాలనీ రూపురేఖలు పూర్తిగా మారాయని తెలిపారు. చిన్నా-పెద్దా తేడా లేకుండా ప్రతి సమస్యను తన సమస్యగా భావించి, ఏ సమస్య ఎదురైనా ప్రజలకు దగ్గరగా ఉంటూ వెంటనే పరిష్కారం చూపేందుకు కృషి చేశానని బాడీ శ్రీనివాస్ అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిరంతరం వార్డు అభివృద్ధి కోసం పనిచేశానని ఆయన గుర్తు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి తనను కౌన్సిలర్గా ఆశీర్వదిస్తే 13వ వార్డును మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అన్ని మతాలను గౌరవిస్తూ, ప్రతి పండుగను అందరితో కలిసి జరుపుకుంటూ, ఐక్యతతో సంతోషంగా జీవించే వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వార్డు అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా మీతోడుగా నిలుస్తానని బాడీ శ్రీనివాస్ స్పష్టం చేశారు.