. . . శక్తి అభియాన్ కోఆర్డినేటర్ ఉషశ్రీ, యోగేష్ మంచివార్
బిచ్కుంద, బతుకమ్మ :
బిచ్కుంద పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు తాము పలు సంవత్సరాలుగా విశ్వాసనీయంగా ఉన్నామని బిచ్కుంద పట్టణానికి చెందిన శక్తి అభియాన్ కోఆర్డినేటర్ ఉషశ్రీ, యోగేష్ మంచివార్ పేర్కొన్నారు. బుధవారం వారు బతుకమ్మ పత్రికేయుడుతో మాట్లాడుతూ తమ రాజకీయ ప్రస్థానం ప్రజా సేవ పట్ల నిబద్ధతను వివరించారు. తాము రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అభివృద్ధి ప్రదాత అయిన తోట లక్ష్మీకాంతరావుకు అంటిపెట్టుకొని ముందుకు సాగుతున్నామని వారు స్పష్టం చేశారు. పార్టీలు, రాజకీయ పరిణామాలు ఏవైనా సరే తోట లక్ష్మీకాంతరావుపై ఉన్న నమ్మకం ఎప్పటికీ మారలేదని మారదని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తోట లక్ష్మీ కాంతారావు నాయకత్వం తమకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. ఈసారి అవకాశం ఇస్తే తోట లక్ష్మి కాంతారావు ఆశీస్సులతో బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణంలోని 11వ వార్డు లేదా నాలుగో వార్డ్ నుంచి బరిలోకి దిగుతున్నామని ఉషశ్రీ, యోగేష్ మంచివార్ వెల్లడించారు. గతంలో అనేక ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, సమస్యలను పరిష్కరించడం, ప్రజలకు అవసరమైన పనులను సాధించడంలో తాము క్రియాశీలకంగా వ్యవహరించామని వారు గుర్తు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా, వ్యక్తిగతంగా తోట లక్ష్మీకాంతరావుకు విధేయులుగా కొనసాగుతున్న తమను ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అవకాశం వస్తే ప్రజల సమస్యను పరిష్కరించడానికి అంకితభావంతో కృషి చేస్తానని బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు శక్తిసామర్థ్యాల మేరకు కృషి చేస్తానని ఉషాశ్రీ, యోగేష్ మంచివార్ తెలియజేశారు.