. . . సమాజ్ వాది పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహీం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
రాబోయే ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ ని ఆదరించాలని పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహీం అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో లౌకిక పార్టీగా పేరు పొందిన సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ సింహాద్రి మార్గదర్శకత్వంలో నడుస్తుందన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్ లలో ఆయా వర్గాలకు చెందిన రిజర్వేషన్లకు అనుగుణంగా లింగ వివక్ష లేకుండా, షెడ్యూల్ కులాల తెగల వారికి, మైనార్టీలకు పెద్దపీట వేస్తుందనన్నారు. భారతీయ జనతా పార్టీ మతతత్వ సిద్ధాంతాలతో దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా ఎలాంటి అభివృద్ధి సాధించలేదన్నారు. కావున నిజామాబాద్ లో కార్పొరేషన్ ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ అభ్యర్థులను ఎన్నుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు ఐషా ఫాతిమా, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ హర్షద్, బిస్మిల్లా బేగం, ఇరమ్ కౌశ, మహమ్మద్ ఉమెన్ తదితరులు పాల్గొన్నారు.