సేవ చేసే అవకాశం ఇవ్వండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మదనం గంగాధర్ బతుకమ్మ,ఆర్మూర్ : పట్టభద్రులు తనకు ఓట్లు వేసి గెలిపించి సేవ చేసే అవకాశం ఇవ్వాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మధనం గంగాధర్ చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన తాను డి.ఎస్.పి ఉద్యోగానికి రాజీనామా చేసి సేవ చేయడానికి వచ్చానని అన్నారు. తనను గెలిపిస్తే అందరి మన్ననలను పొంది సేవ చేస్తానన్నారు. 26 సంవత్సరాల పోలీస్ ఉద్యోగ జీవితంలోని అనుభవాన్ని ప్రజా జీవితంలో ఉపయోగిస్తానని...