Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 January 2026, 5:11 pm Posted by : ramakrishna

వార్డు అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వండి

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యేషల సంధ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 11వ వార్డులో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. వార్డులో నెలకొన్న సమస్యలను గుర్తించి ప్రజల సహకారంతో పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. “వార్డు అభివృద్ధి కోసం ఒక అవకాశం ఇవ్వండి” అంటూ ఓటర్లను యేషల సంధ్య కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.