ఆడపిల్లలను తప్పనిసరిగా చదివించాలి

జాతీయ బాలికల దినోత్సవంలో ఎమ్మెల్యే పోచారం   బాన్సువాడ, బతుకమ్మ  : పిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లల చదువుపై నిర్లక్ష్యం చేయవద్దని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలోని ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో జిల్లా బాలికల సంరక్షణ, మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్‌ ఛైర్మన్‌ కాసుల బాలరాజ్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ జంగం గంగాధర్‌, జిల్లా మహిళా సంక్షేమ అధికారిణి ప్రమీల, బాలికల సంరక్షణ కమిటీ సభ్యులు స్వర్ణలత...