Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 7:29 pm Posted by : ramakrishna

ఇరవై నాలుగు గంటల్లో బాలిక కిడ్నాప్ కేసు ఛేదన

. . . బాలికను విక్రయించేందుకు కిడ్నాప్

. . . మహరాష్ట్రలో పట్టుకున్న పోలిసులు

 మద్నూర్, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా మద్నూర్ లో ఈ నెల 6 న జరిగిన 6 సంవత్సరాల బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. బుదవారం ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పోలిస్ అధికారుల వివరాలను వెల్లడించారు.. వారి కధనం ప్రకారం..                                 మద్నూర్ మండల కేంద్రానికి   చెందిన 6 సంవత్సరాల బాలికను తల్లి ఇంటి వద్ద వదిలి బందువుల ఇంటికి నిజామాబాద్ కు వెళ్ళింది. ఇంటి వద్ద ఉన్న బాలికను మద్నూర్ మండలం తడి హిప్పర్గ గ్రామానికి చెందిన హర్నే రాజేందర్ బాలికకు మాయమాటలు చెప్పి తనతో పాటు మహరాష్ట్ర లోని దెగ్లూర్ కు తరలించారు. ఇంటికి వచ్చిన తల్లి తన కూతురు కనిపించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అదేశాల తో బాన్సువాడ డీఎస్పీ పర్యవేక్షణలో నాలుగు టీంలతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు సీసీ కెమెరాలతో పాటు సాంకేతిక సహయంతో దెగ్లూర్ లో రాజేందర్ ను పట్టుకుని అతని వద్ద ఉన్న బాలికను క్షేమంగా తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. రాజేందర్ బాలికను  నాందేడ్, ఔరంగాబాద్ ప్రాంతాల్లో విక్రయేంచుటకు యత్నించి విఫలమై దేగ్లూర్ లో తిరుగుతుండగా పట్టుకుని అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలిసులను అభినంధించారు.

Girl's kidnapping case solved within 24 hours