రైల్వే స్టేషన్ నుంచి బాలిక మిస్సింగ్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఓ బాలిక అదృశ్యమైంది. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్ కు వచ్చిన బాలిక ఆ తరువాత కనిపించకుండాపోయింది. బాలిక ఆచూకీ తెలిసిన వారు తమకు లేదా వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని నిజామాబాద్ రైల్వే పోలీసులు కోరారు.