నగరంలో బాలిక కిడ్నాప్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: రోడ్డు పక్కన తల్లితోపాటు నిద్రిస్తున్న బాలికను దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన శిరీష తన మూడేళ్ల కూతురు రమ్యతో రోడ్డు పక్కన నిద్రిస్తుండగా దుండగుడు పాపను ఎత్తుకెళ్లాడు. కొద్ది సేపటి తరువాత మెలుకవ వచ్చిన శిరీష పక్కన కూతురు లేకపోవడంతో ఆందోళన గురైంది. వెంటనే ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.