నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 2025-26 విద్యా సంవత్సరానికి గాను దోస్త్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ అడ్మిషన్లకు సంబంధించిన సహాయ కేంద్రం కళాశాలలో కలదని కళాశాల ,ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. 2025 -26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థినీ విద్యార్థులకు బిఏ, బీకాం, బీఎస్సీ ,బి బి ఏ ,బి సి ఏ కోర్సులతోపాటు నూతనంగా అందుబాటులోకి వచ్చిన 3 వృత్తిపర పరమైన కోర్సులతో కలిపి మొదటి సంవత్సరంలో 1860 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కళాశాలలో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుందనీ, కళాశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత విద్యారంగంలోనూ క్యాంపస్ ప్లేస్మెంట్లలోనూ అత్యద్భుతంగా రాణిస్తున్నారనీ, కళాశాలకు విశిష్టమైన ఐఎస్ఓ నాక్ గుర్తింపు ఉందని తెలిపారు. నిజామాబాద్, నిర్మల్ ,కామారెడ్డి లాంటి చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు గిరిరాజ్ కళాశాలలో అడ్మిషన్ పొందే సువర్ణావకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. ఈ అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థుల కొరకు ఉచిత సలహాలు, సూచనల సహాయ కేంద్రం కళాశాలలో పనిచేస్తుందనీ సహాయం కేంద్రం కొరకు విద్యార్థులు కళాశాలలో నేరుగా లేదా 9440019918,9059344379 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.