Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 March 2025, 12:14 pm Posted by : ramakrishna

రాష్ట్రస్థాయి సదస్సులో గిరిరాజ్ కళాశాల విద్యార్థులు

నిజామాబాద్, బతుకమ్మ:  కళాశాల కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన  రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో నగరంలోని గిరిరాజ్ కళాశాల చరిత్ర విభాగం విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాలకు చెందిన విద్యార్థులు ఎస్ మంగ, బి చందన, పి చికిత, సీహెచ్ అక్షయ, ఆర్ చందన, బి దివ్యరాణి ‘తెలంగాణ పండగలు , జాతరలు’ అనే అంశంపై తాము రూపొందించిన ప్రాజెక్ట్ ను సమర్పించారు. చరిత్ర అధ్యాపకులు శ్రీనివాస్ పర్యవేక్షణలో విద్యార్థులు తమ ప్రాజెక్టును రూపొందించారని కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు.