Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 July 2025, 1:18 pm Posted by : ramakrishna

యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ.. భారీగా వచ్చిన భక్తులు

యాదగిరిగుట్ట, బతుకమ్మ  :  యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో శ్రీ నరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా శనివారం ఉదయం గిరి ప్రదక్షిణ జరిగింది. వైకుంఠ ద్వారం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొండ చుట్టూ తిరిగారు. స్వాతి నక్షత్రం సందర్భంగా గర్భాలయంలో అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర అన్నమాచార్య సేవా ట్రస్ట్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.