Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 March 2025, 7:49 pm Posted by : ramakrishna

చొక్కయ్య గుట్ట పై గిరి ప్రదక్షణ

భీమ్ గల్, బతుకమ్మ: పట్టణ శివారులోని చొక్కాయ్యగుట్ట పై యోగ  సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం గిరిప్రదక్షిణ కార్యక్రమం ను నిర్వహించారు. ఇందులో భాగంగా అయ్యప్ప ఆలయంలోయోగ ఆసనాలు, ధ్యానం, భక్తి పాటలతో నాట్య నృత్యాలు, చేసి అమృత ఆహారం భుజించారు.ఈ సందర్భంగా యోగ గురువు అనంతరావు మాట్లాడుతూ ప్రతి రోజు యోగ చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, రకరకాల రోగాలకు పరిష్కారం పొందావచ్చని తెలి పారు. యోగ వల్ల జరిగే ప్రయోజనాలు వెన్ను లేదా మెడ నొప్పి, నిద్ర సమస్యలు, తలనొప్పి, మాదకద్రవ్యాల దుర్వినియోగం, ఏకాగ్రత అసమర్థతతో సహా అనేక విధాలుగా ఒత్తిడి బహిర్గతమవు తుందని తెలిపారు.  అందరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 100 మంది పైగా యోగ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో నరసయ్య , శివ, రమేష్ పురస్తు లింబాద్రి, రాకేష్, భూపాల్, శ్రీనివాస్, పాల్గొన్న యోగ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.