Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2025, 7:43 pm Posted by : ramakrishna

జిల్లా పోలీస్ కమిషనర్ కు బుద్ధుడు, అంబేడ్కర్ల పుస్తకాల బహుకరణ

మోర్తాడ్, బతుకమ్మ: శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సి.పి హెడ్ క్వార్టర్స్ కార్యాలయానికి వెళ్ళి బుద్ధుడు అంబేడ్కర్ల పుస్తకాలు ఇచ్చి గౌరవించారు. సాయి చైతన్య విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహారిస్తారని, డ్రగ్స్ నిర్మూలన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పని చేశారాని పేరుంది. జిల్లాలో శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో చురుకుగా వ్యవహారిస్తూ, రాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు  కూడా నిర్వహిస్తుంటారని జిల్లా ప్రజలచే ప్రశంసలు పొందుతున్నారు. మరి ముఖ్యంగా జిల్లాలోని భూ సమస్యల పరిష్కారంలో కూడా పెద్ద ఎత్తున చొరవలు చూపుతున్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో జిన్నా జనార్దన్ (ప్రజాకలం వేల్పూర్ మండలం), ప్రజాకలం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అంగుళి మాలజీ, జనప్రజావాణి మోర్తాడ్ మండలం జర్నలిస్ట్ మామిడి రాజు, ఆర్మూర్ రూరల్ జర్నలిస్ట్ మూలనివాసి మాలజీ, సీనియర్ అంబేడ్కరైట్ నాయకులు మల్లూరి రాజారాం పాల్గొన్నారు. ఆరంభంలో అంబేడ్కరైట్ జర్నలిస్టులు కమిషనర్ దిన్ దయాల్ రచించిన “అంబేడ్కర్ దిన చర్య”, భారత దేశంలో బౌద్ధ ధమ్మం” అనే గొప్ప పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు.