అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోస్ లకు జీహెచ్ఎంసీ నోటీసులు
హైదరాబాాద్, బతుకమ్మ : అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోస్ లకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజును ఈ స్టూడియోలు తక్కువగా చెల్లిస్తూ.. వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తూ భారీగా పన్నులు ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రూ.11.52 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 61 వేలు మాత్రమే అన్నపూర్ణ స్టూడియో చెల్లిస్తుంది. రూ. 1.92 లక్షలు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం రూ. 1900 మాత్రమే చెల్లిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. పూర్తిస్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి...