అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ నోటీసులు

 హైదరాబాద్, బతుకమ్మ : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది.  అనుమతులు లేకుండా పెంట్ హౌస్ నిర్మించారని నోటీసుల్లో పేర్కొంది.  అల్లు అరవింద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో అల్లు బిజినెస్ పార్క్ పేరిట నాలుగంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకుని ఏడాది క్రితం  పూర్తి చేశారు. కాగా,  కొద్ది రోజుల క్రితం అనుమతి లేకుండా పెంట్ హౌస్ నిర్మించడంతో జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది.