Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 November 2024, 6:21 pm Posted by : ramakrishna

వరోరా అసెంబ్లీ కోఆర్డినేటర్ గా ఘన్ రాజ్ కాపుకార్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా చంద్రపూర్ లోకసభలోని వరోరా అసెంబ్లీ నియోజకవర్గానికి కోఆర్డినేటర్ (అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త గా) ఘన్ రాజ్ కాపుకర్ నియమితులయ్యారు. గతంలో ఘన్ రాజ్ ఎన్ఎస్ యుఐ, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా పని చేశారు. రాష్ట్ర కమిటీలోనూ పని చేశారు. ఈ నియామకానికి సహకరించిన కాంగ్రెస్ అగ్రనేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.