జీజీహెచ్ ఆకస్మిక తనిఖీ
బతుకమ్మ, నిజామాబాద్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అవుట్ పేషంట్, ఇన్ పేషంట్ విభాగాలను, ఫీవర్ వార్డు, ఆపరేషన్ థియేటర్, శస్త్ర చికిత్స వార్డు, రక్త నిధి కేంద్రం, సెంట్రల్ ల్యాబ్, ఎలిసా టెస్ట్ సెంటర్, టీ.హబ్ సెంటర్ తదితర వాటిని సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు. ప్రతిరోజూ సగటున ఎంతమంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారు, వారిలో ఎంతమంది ఇన్ పేషంట్లుగా అడ్మిట్ అవుతున్నారు, డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు వంటి వాటితో...