పాత కాంట్రాక్టర్ కే జీజీహెచ్ మొగ్గు..?
ఆనాడు తప్పైంది ఇప్పుడు రైట్ ఎందుకు పాత కాంట్రాక్టర్ కే టెండర్ లో చక్రం తిప్పిందెవరు..? నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గత అధికారుల హాయంలో అవినీతి అక్రమాలకు డైట్ టెండర్ల కేటాయింపు జరిగిందని రచ్చ రచ్చైన విషయం తెలిసిందే. దానితో గత తొమ్మిది నెలలుగా దాని ఖరారును అటకెక్కించిన అధికార యంత్రాంగం మళ్లీ పాత కాంట్రాక్టర్ కే డైట్ టెండర్ల కేటాయింపు దాదాపు ఖరారు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తొమ్మిది నెలలుగా డైట్ టెండర్లు ఖరారు చేయకుండా...