Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 March 2025, 11:19 pm Posted by : ramakrishna

పాత కాంట్రాక్టర్ కే జీజీహెచ్ మొగ్గు..?

  • ఆనాడు తప్పైంది ఇప్పుడు రైట్ ఎందుకు
  • పాత కాంట్రాక్టర్ కే టెండర్ లో చక్రం తిప్పిందెవరు..?

 

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గత అధికారుల హాయంలో అవినీతి అక్రమాలకు డైట్ టెండర్ల కేటాయింపు జరిగిందని రచ్చ రచ్చైన విషయం తెలిసిందే. దానితో గత తొమ్మిది నెలలుగా దాని ఖరారును అటకెక్కించిన అధికార యంత్రాంగం మళ్లీ పాత కాంట్రాక్టర్ కే డైట్ టెండర్ల కేటాయింపు దాదాపు ఖరారు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తొమ్మిది నెలలుగా డైట్ టెండర్లు ఖరారు చేయకుండా జాప్యం చేసిన అదికారులు పాతవారికే మొగ్గు చూపడంలో ఆంతర్యం ఏమిటనే చర్చ జరుగుతుంది. పాత అధికారుల తోవలోనే ఆసుపత్రి ప్రస్తుత అధికారులు పని చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తొమ్మిది నెలల క్రితం అక్రమమైంది ఇప్పుడు ఎలా సక్రమమైందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జీజీహెచ్ లో కుర్చీల కోసం కొట్లాటలు తప్పితే రోగులకు మెరుగైన వైద్యం, సేవల విషయం పట్టింపులేదని మరోసారి రుజువైంది. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రిలో అధికారులు కేవలం స్వంత ప్రాక్టిస్ తో పాటు స్వ  ప్రయోజనాలకే ప్రాధాన్యత అను ఆరోపణలు నిజం అవుతున్నాయి. డైట్  నిర్వహణ విషయంలో కరోనా కాలంలో అవినీతి అక్రమాలపై ప్రశ్నించిన అధికారులు ఇప్పుడు మళ్లీ పాత వారికే అనర్హులకు(బినామీ) కాంట్రాక్టర్ లకు కేటాయింపులు జరిగితే ఎలా చూస్తు ఊరుకున్నారనే చర్చ జరుగుతుంది. కనీసం గతంలో టెండర్లు దాఖలు చేసిన వారిని పిలిచి మాట్లాడారా లేదా అనేది తెటతెల్లం కాలేదు. కొందరు ఆనాడు టెండర్లు దాఖలు చేసిన వారితో లోపాయికారి తాయిలాల నేపథ్యంలోనే మళ్లీ గతంలో కోట్ల రూపాయిల బినామీ బిల్లులు లేపిన వారికి టెండర్లు దక్కేలా కొందరు చక్రం తిప్పారని విమర్శలు వచ్చాయి. దానికి తోడు కొందరు అధికారులు పాత కాంట్రాక్టర్ వలలో చిక్కుకోవడంతో వారికే కేటాయించేలా ప్రణాళిక రచన అమలు జరిగిందని సమాచారం. తొమ్మిది నెలల కాలంలో అధికారులు సహకారంతో గతం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నడుపుతున్న వారికే డైట్ టెండర్ ని చేస్తున్నవారికే డైట్ టెండర్లు దక్కడం పైన ఎన్నో ఆరోపణలు ఉన్న దక్కించుకోవడంపై పలువురు అవమానాలకు తావిస్తుందని  టెండర్ దారులు ఆరోపణ చేస్తున్నారు.