Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 September 2025, 5:24 pm Posted by : ramakrishna

టీజీ సీపీ సెట్ 2025లో జిజి విద్యార్థుల ర్యాంకుల హవా

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన టీజీ సీపీ సెట్ 2025లో సత్తాచాటిన గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్ విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్ మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రంగరత్నం, అధ్యాపకులు అభినందించారు. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో  ఏకంగా రాష్ట్ర ప్రథమ ర్యాంకును మునిగంటి కీర్తన సాధించారు.   మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో అత్యధికంగా 50 లోపు ర్యాంకుల్లో 5 ర్యాంకులను జి.జి. విద్యార్థులు కైవసం చేసుకున్నారు. టోపీ దుర్గ ప్రసాద్ 2వ ర్యాంక్,  నూనె అఖిల్ తేజ 5వ ర్యాంక్, పండుగ వైష్ణవి 7వ ర్యాంక్,  పోతుల వైష్ణవి 24వ ర్యాంక్, గుగ్గిలం స్ఫూర్తి 35వ ర్యాంక్, సాధించారు.  కంప్యూటర్ సైన్స్ లో సలిగంటి సుప్రియ 66వ ర్యాంక్ ను, బయోటెక్నాలజీలో మహమ్మద్ హసీనా 128వ ర్యాంక్, హిందిలో  చింతల అఖిల 78వ ర్యాంక్, ఇంగ్లీషులో మైల గంగోత్రి 20వ ర్యాంక్, ఆల్గొట్ పూజ 63వ ర్యాంక్, షగుట్ట కౌసర్ 124వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. జువాలజీ సబ్జెక్టులో విద్యార్థులు మొత్తం 18 ర్యాంకులు పొందగా 100 లోపు ర్యాంకుల్లో ఫరియల్ తాబ 18వ ర్యాంక్, జియా కౌసర్ 96వ ర్యాంక్, అరోరా నౌరినె 98వ ర్యాంకులతో మెరిశారు.అత్యద్భుతమైన ప్రతిభ పాటవాలు చూపి విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన అధ్యాపకులను ప్రిన్సిపాల్  ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.