నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గిరిరాజ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) లో 2 వ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్ తెలిపారు. బుధవారం నిర్వహించిన పరీక్షకు 1221 విద్యార్థులకు గాను 1191 మంది విద్యార్థులు హాజరయ్యారని, 30 మంది గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు. అలాగే 6 వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు ఆరుగురు విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ పి.రామ్ మోహన్ రెడ్డి తెలిపారు.