Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 5:44 pm Posted by : ramakrishna

ప్రశాంతంగా కొనసాగుతున్న జీజీ కళాశాల సెమిస్టర్ పరీక్షలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గిరిరాజ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) లో సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్ తెలిపారు. గురువారం నిర్వహించిన 4 వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 594 విద్యార్థులకు గాను 583 మంది విద్యార్థులు హాజరయ్యారని, 11 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే 5వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 76 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు ఆరోగ్యపరమైన వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ పి.రామ్ మోహన్ రెడ్డి తెలిపారు.

 

GG College semester exams continue peacefully