నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఆంగ్లవిభాగం అధ్యాపకురాలు నాగజ్యోతి తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి “మంజు కపూర్ రచించిన నవలలలో కుటుంబం, వివాహం మరియు సమాజం” అనే అంశంపై ” డాక్టర్ కె.వి. రమణాచారి పర్యవేక్షణలో పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల “స్టాఫ్ క్లబ్” ఆధ్వర్యంలో డాక్టర్ నాగజ్యోతిని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఘనంగా సన్మానించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అధ్యాపకురాలు నాగజ్యోతి బోధనలోనూ, కళాశాల కార్యక్రమాలన్నింటిలో చురుకుగా సేవలు అందిస్తుందని, ఎన్నో బాధ్యతల మధ్య డాక్టరేట్ పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. రంగరత్నం, పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్, పీఆర్.ఓ.,ఆంగ్లవిభాగం అధిపతి డాక్టర్ దండుస్వామి, ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, అకాడమిక్ కోఆర్డినేటర్ నహేద బేగం, వివిధ విభాగం అధిపతులు,డాక్టర్ రంజిత, వినాయకుమార్, డాక్టర్ జయప్రసాద్, రాహుల్, ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, అధ్యాపకులు వివేకానంద్, భోజదాస్, గంగాధర్, ప్రతిభ, వెంకటరమణ ఏ.ఓ. రామ్ కిషన్, సూపరిండెంట్ ఉదయ భాస్కర్, తదితర కార్యాలయ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.