నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గిరిరాజ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) లో సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్ తెలిపారు. సోమవారం నిర్వహించిన 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 935 విద్యార్థులకు గాను 913 మంది హాజరయ్యారని, 22 మంది గైర్హాజరయ్యారన్నారు. 2వ సెమిస్టర్ పరీక్షలకు 1484 విద్యార్థులకు గాను 1449 మంది విద్యార్థులు హాజరయ్యారని 35 మంది గైర్హాజరయ్యారని ప్రిన్సిపాల్ ఆచార్య పి.రామ్ మోహన్ రెడ్డి తెలిపారు.
