Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 5:40 pm Posted by : ramakrishna

ప్రశాంతంగా కొనసాగుతున్న జీజీ కళాశాల పరీక్షలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గిరిరాజ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) లో 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన పరీక్షకు 827 విద్యార్థులకు గాను 813 మంది విద్యార్థులు హాజరయ్యారని, 15 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అలాగే 210 మంది విద్యార్థులు 3వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షను రాశారని ఇంచార్జి ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.రంగరత్నం తెలిపారు.