రుద్రూర్, బతుకమ్మ: కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె అనివార్య కారణాల వల్ల జూలై 9 కి వాయిదా పడిందని ఆదివారం రుద్రూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ తెలిపారు. నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేసి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మే 20న కార్మికులు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, వివిధ రూపాల్లో ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ మండల కన్వీనర్ మహమ్మద్ రఫీఖ్, రవీందర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.