Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 6:05 pm Posted by : ramakrishna

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ మున్సిపల్ జోన్ ఆఫీసు, ఫులాంగ్ టీటీడీ కల్యాణ మండపం, గౌతంనగర్, గోల్ హనుమాన్ వాటర్ ట్యాంక్, బడా బజార్ వాటర్ ట్యాంక్ తదితర కేంద్రాలను సందర్శించి, నామినేషన్ల స్వీకరణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. నిబంధనలకు అనుగుణంగా స్వీకరణ ప్రక్రియ జరుగుతోందా అని నిశిత పరిశీలన చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, హెల్ప్ డెస్క్ లను పరిశీలించారు. టీ.పోల్ యాప్ లో ఎన్నికల రిపోర్టులు అప్లోడ్ చేస్తున్న వైనాన్ని పరిశీలించారు. అబ్జర్వర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, స్థానిక అధికారులు ఉన్నారు.

 

 

General Observer inspects nomination collection centers General Observer inspects nomination collection centers General Observer inspects nomination collection centers