ఎన్నికల సాధారణ పరిశీలకులు విస్తృత తనిఖీలు

నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు జీవీ.శ్యాంప్రసాద్ లాల్ మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పని తీరును, నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు.  ఇందల్వాయి మండలంలో ఎఫ్.ఎస్.టీ బృందాలు చేపడుతున్న తనిఖీలను గమనించి, పలు సూచనలు చేశారు. ఎన్నికలలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నందున గట్టి నిఘా కొనసాగిస్తూ, పకడ్బందీగా సోదాలు జరపాలని అన్నారు. అనంతరం టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును తనిఖీ చేశారు. ఇప్పటివరకు సోదాలలో...