భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణంలోని మోక్షనంద ఆశ్రమం లోగీతా జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో నిర్వాహకులు ఇస్కాన్ ప్రభూజి సుందర రుప దాస్ ప్రభుజీ మాట్లాడుతూ ప్రపంచంలోనీ అత్యుత్తమ పవిత్ర గ్రంథం భగవద్గీత అని “గీ”అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తుంది.”త” అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మ స్వరూపాన్ని ప్రభోదిస్తుంది అన్నారు.భగవద్గీత మహాభారతం యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించిందని,దాయాధులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారని అన్నారు.భగవద్గీత లోని మొత్తం 18 అధ్యాయాలు ఉన్నయని,ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క “యోగము” అని చెబుతారని తెలిపారు. వీటిలో 1 నుండి 6 వ అధ్యాయాలను “కర్మషట్కము”అని,7 నుండి 12 వరకు అధ్యాయాలను “భక్తి షట్కము”అని,13 నుండి 18 వరకు “జ్ఞాన షట్కము”అంటారని అని తెలిపారు. ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థి విద్యార్థులచే నాట్య నృత్యాల కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో నంద గోపాల ఆనంద్ దాస్, రాజేంద్ర ప్రభు, ఉషశ్రీ దేవి దాసి,, శ్రీనివాస్, దత్తు, లక్ష్మీనారాయణ, శివ, సనాతన, నరేష్, గంగాధర్, నవీన్, ప్రశాంత్, రాజేందర్, బాపూరావు, లింబాద్రి, మతాజీలు, వండలాది మందికి పైగా హరే కృష్ణ భక్తులు పాల్గొన్నారు.
