Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2025, 1:54 pm Posted by : ramakrishna

శ్రీవారికి గరుడవాహన సేవ

– కొనసాగుతున్న లక్ష్మీనృసింహుని జయంతి ఉత్సవాలు
భీమ్ గల్, బతుకమ్మ : లక్ష్మీ నృసింహస్వామి జయంతి ఉత్సవాలు నింబాచలంపై వైభవంగా కొనసాగుతున్నాయి. వైశాఖ శుద్ధ చతుర్థి సందర్భంగా భీమ్ గల్ గ్రామాలయంలో అర్చకులు శ్రీవారికి గరుడ సేవ ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గర్భాలయంలో ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించారు.

శ్రీవారి ఉత్సవమూర్తులను చిన్న గరుడ వాహనం పైన ఉంచి చిన్న గరుడ సేవను నిర్వహించారు. సాయంత్రం పెద్ద గరుడ వాహనాన్ని పూలతో సుందరంగా అలకరించి పెద్ద గరుడ వాహనం పై స్వామి ఉత్సవమూర్తులను ఉంచి గ్రామాలయం పుర వీధుల్లో నర్సింహస్వామి గోవిందా.. అనే హరినామా భజన, జయ జయ జయధ్వనాల మధ్య ఊరేగించారు. కార్యక్రమం లో భాగంగా అర్చకులు భక్తులకు హారతినిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు.

Garuda Vahana service to the Lord