గర్గుల్ – రామారెడ్డి రహదారి మూసివేత
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి, గర్గుల్ గ్రామాలను కలిపే ప్రధాన రహదారిలో గంగమ్మ వాగుపై వంతెన నిర్మాణం కొనసాగుతోంది. ఈ వంతెన పూర్తికాకపోవడంతో వాహనాలు తాత్కాలిక డైవర్షన్ రోడ్డుపై ప్రయాణిస్తునాయి. అయితే కురుస్తున్న వర్షాల వల్ల వాగులో నీటి ప్రవాహం తీవ్రమవడంతో ఈ మార్గం కూడా ప్రమాదకరంగా మారింది. నీటి ఉధృతి పెరగడం వల్ల ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు డైవర్షన్ రోడ్డుపై ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. ప్రజలు అనవసరంగా ఈ మార్గంలో ప్రయాణించవద్దని, అత్యవసర ప్రయాణాల కోసం మాత్రమే...