Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 8:03 pm Posted by : ramakrishna

గణపతి బప్పా మోరియా మంగళమూర్తి మోరియా…

 

. . . గణనాథుడికి పూజలు చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, బతుకమ్మ :

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌, బంజారాహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆయన సతీమణి శ్రీమతి పుష్ప, కుమారుడు  ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కోడలు సోని రెడ్డి, మనుమలు రుషాంక్ రెడ్డి, రిషిక్ రెడ్డి పాల్గొని గణపతికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలను ప్రసాదించాలని పోచారం శ్రీనివాసరెడ్డి ప్రార్థించారు. తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఇంటా గణనాథుని ఆశీస్సులు నిండాలని ఆకాంక్షించారు.