Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 6:29 pm Posted by : ramakrishna

ఓడిస్సా టూ మహారాష్ట్ర గంజాయి రవాణా

 

. . . ముగ్గురి నిజామాబాద్ గాంజా బ్యాచ్ దందా

. . . రెండు కోట్ల గంజాయి రవాణా గుట్టు రట్టు చేసిన కామారెడ్డి పోలీసులు

 కామారెడ్డి, నిజామాబాద్:

నిజామాబాద్ కు చెందిన గంజాయి బ్యాచ్ అంతా రాష్ట్రంగా సాగిస్తున్న గంజాయి రవాణాను కామారెడ్డి పోలీసులు రట్టు చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నే కాకుండా రాష్ట్రాల సరిహద్దులను దాటిస్తు గంజాయి  రవాణాలో ఆరి తేరిన గాంజా బ్యాచ్ దందాను  బ్రేక్ చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు…  కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం  ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ… నిజామాబాద్ కు చెందిన కరీముల్లా అలియాస్ కరీం , గైని సుభాష్. షేక్ రహీమ్ లు గంజాయి దందా చేస్తున్నారు. ముగ్గురు అంతా రాష్ట్రంగా గంజాయి రవాణా చేస్తుండగా ఇదివరకు కేసులు ఉన్నాయి.  అశోక్ లేలాండ్ వాహనం లో సుమారు 387.128 కిలోల గంజాయిని ఓడిస్సా నుంచి మహరాష్ట్రలోని నాసీక్ కు తరలిస్తున్నారు. కామారెడ్డి పోలీసులకు గంజాయి రవాణా  విషయం ఉప్పంధ డంతో కామారెడ్డి డిఎస్పీ మధుసుధన్ ఆధ్వర్యంలో ఐదు టీం లో తనిఖీలు చేపట్టారు. దేవుని పల్లి పోలీసులు క్యాసంపల్లి శివారులోని రాయల్ బాబా వద్ద అశోక్ లే ల్యాండ్ వాహనంలో పనస పండ్ల చాటున గంజాయి రవాణా జరిగినట్లు గుర్తించి పట్టుకున్నారు. షేక్ కరీముల్లా అలియాస్ కరీం తో పాటు గైని సుభాష్, షేక్ రహీం ను పట్టుకున్నారు. వారివద్ద స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో రూ.1,93,56,400 లుగా గుర్తించారు. యువత భవిష్యత్ లక్ష్యంగా ఇటివల కాలంలో కామారెడ్డి జిల్లాలో ఆపరేషన్ కవచ్  పేరుతో డ్రగ్స్ నియంత్రణకు పోలిస్ శాఖ ఉక్కుపాదం మోపుతుంది. ముగ్గురు పట్టుబడగా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు. గంజాయి అక్రమ రవాణా రాకెట్ ను చేదించిన డీఎస్పీ మధు సుధన్, కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్, దేవునిపల్లి ఎస్ఐ రంజిత్, బిబీ పేట ఎస్ఐ విజయ్, పిట్లం ఎస్ఐ ఆంజనేయులు. మాచారెడ్డి ఎస్ఐ అనిల్, సదాశివనగర్ ఎస్ ఐ పుష్ప రాజ్ లను పోలీస్ సిబ్బంది అభినంధించారు.

Ganja smuggling from Odisha to Maharashtra

 అంతరాష్ట్ర గంజాయి రవాణా దందా వేనుక గాంజావాలాలు?…

 

కామారెడ్డి పోలీసులు ఓడిస్సా నుంచి మహారాష్ట్ర కు రవాణా చేస్తున్న నిషేదిత గంజాయి రాకెట్ వెనుక నిజామాబాద్ కు చెందిన ముగ్గురు కీలక వ్యక్తులు పట్టుబడగా వారి వేనుక  గాంజావాలాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. మన్యం నుంచి గంజాయి రవాణా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వారు అరి తెరారు. జిల్లా కేంద్రంగా గంజాయి దందాలో రాటుదేలిన వారికి ఇటు పోలీస్ అటు ఎక్సైజ్ శాఖలో సంబంధాలు ఉండటంతో వారి పేర్ల వెనుక గాంజావాలాలు అని పేరు సార్థక నామధేయం గా ఉంది.. పోలీస్ శాఖ పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి, పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసిన గంజాయి దందాకు మాత్రం బ్రేక్ పడలేదు. ప్రధానంగా క్వింటాళ్ల కొద్ది గంజాయి రవాణా వాటిని ఎగుమతిలో సరుకులు లారీలలో( డి సి యం, ఐచర్ ) తరలించడం దాని రవాణాకు కార్లు రెక్కి నిర్వహించడం లో నిజామాబాద్ గంజాయి స్మగ్లర్ల పేరు మోసినారు. గతంలో కామారెడ్డి, నిజామాబాద్ తో పాటు ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో పట్టుబడినప్పుడు నిజామాబాద్ కు చెందిన గాంజావాలాల పేర్లు మొదట తెరమీదకు వచ్చాయి. చాలా రోజుల తర్వాత కామారెడ్డి పోలీసులు రెండు కోట్ల గంజాయి రవాణా వెనుక సూత్రధారులు నిజామాబాద్ వాసులను అరెస్టు చేయగా పాత్రదారులు గాంజావాలలు అనే చర్చ జరుగుతుంది..

Ganja smuggling from Odisha to Maharashtra