గంజాయి ముఠా అరెస్ట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజావెంకట రెడ్డి తెలిపారు.  పోలీసుల కథనం ప్రకారం.. డిచ్ పల్లి మండలంలోని మెంట్రాజ్ పల్లి గ్రామ జంక్షన్ వద్ద డిచ్ పల్లి సీఐ మల్లేష్, ఎస్ఐ వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి హైదరబాద్ వైపు ద్విచక్ర వాహనాలపై వస్తున్న ఇద్దరిని తనిఖీ చేశారు. ఈ క్రమంలో వారి వద్ద నుంచి 900 గ్రాముల గంజాయి లభించింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని...